Sunday, May 12, 2024

రూ.11 కోట్లు కొట్టేసిన కి’లేడి’…

హైదరాబాద్‌, : జల్సాలకు అలవాటు-పడి వ్యాపారిని మోసం చేసిన మహిళతో పాటు- ఆమెకు సహకరించిన వారిని కట కటాల్లోకి సైబరాబాద్‌ పోలీ సులు పంపారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం… బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విలాసాలకు అలవాటు- పడిన ఓ సాధారణ మహిళ స్మృతిసింహ, తాను ఇంటర్నేషనల్‌ హ్యుమన్‌ రైట్స్‌ చైర్మెన్‌ సౌత్‌ ఇండియా అని పరిచయం చేసుకుంటూ డబ్బు ఉన్న వారిని లక్ష్యం చేస్తూ మోసాలకు పాల్పడేది. ఈమె తన ముగ్గురు అనుచరులు రాఘవరెడ్డి, రణధీర్‌ రెడ్డి, రామకృష్ణ రెడ్డిలతో కలిసి బాచుపల్లి పరిధిలో నివాసం ఉండే వీరా రెడ్డి(36) అనే వ్యాపారిని తాను ఐపీఎస్‌ కు సెలక్ట్‌ అయ్యాయనని, నమ్మించి అతని నుంచి రూ.11కోట్ల వరకు బ్లాక్‌ మేయిల్‌ చేసి భయపెట్టి వసూలు చేసింది. అంతేకాదు వీరారెడ్డి సోదరుడికి తన చెల్లితో వివాహం జరిపిస్తానని నమ్మబలికింది. వీరి బ్లాక్‌ మేయిల్‌ కి విసిగి వేసారిన వీరారెడ్డి బాచుపల్లి పియస్‌ లో ఈనెల 12న స్మృతి సింహపై ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు నిందితులపై నిఘాపెట్టి బుధవారం స్మృతి సింహ, ఆమెకు సహకరించిన మరో ముగ్గురు రాఘవ రెడ్డి, రణధీర్‌ రెడ్డి, రామకృష్ణ రెడ్డి లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించా రు. వీరి వద్ద నుండి సుమారు ఆరు కోట్ల మేర ఆస్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో యాభై లక్షలు విలువ చేసే బంగారు, వెండి నగలు, ఏడు మొబైల్‌ ఫోన్స్‌ , రెండు లక్షల నగదు, క్రెడిట్‌ , డెబిట్‌ కార్డులు, ఖరీదైన ఐదు కార్లు ఒక విల్లాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జల్సా లకు అలవాటు- పడి ఈజీ మనీకోసం డబ్బు ఉన్న వారిని టార్గెట్‌ చేయడం వీరి లక్ష్యమని, వీరి గ్యాంగ్‌ లో ఉండే మరో వ్యక్తి అంకిరెడ్డి విజయకుమార్‌ రెడ్డి తాను ఐపీఎస్‌ కు సెలెక్ట్‌ అయ్యాయని చెప్పుకొని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటాడని, ప్రస్తుతా నికి ఇతను పరారీలో ఉన్నాడని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. డబ్బున్న వారిని భయపెట్టి డబ్బు, బంగారం, ఆస్త్తి, కార్లు దోచు కోవడం వీరి పని అని ప్రజలు ఇలాంటి వారి వద్ద మోసపో వద్దని తెలిపారు. ఎవరైనా ఇలాంటి వ్యక్తులు తారస పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. విలేఖరుల సమావేశంలో కూకట్‌ పల్లి ఏసీపీ సురేందర్‌ రావు, బాచుపల్లి ఇన్‌ స్పెక్టర్‌ నర్సింహ్మ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement