Sunday, April 28, 2024

HZB Politics: కేసీఆర్ ఓ బ్రోక‌ర్ మాత్ర‌మే.. వ‌డ్లు కొనేది తామే అంటున్న బండి సంజ‌య్‌..

హుజురాబాద్ ఎన్నికలో తామే గెలుస్తున్నామని.. అన్ని సర్వేలు అదే ప్రూవ్ చేస్తున్నాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. హుజూరాబాద్ లోని మధువని గార్డెన్స్ లో ఈ రోజు జరిగిన మీడియా మీట్‌లో ప‌లు అంశాలు వెల్ల‌డించారు. టీఆర్ఎస్ క్యాష్ ను నమ్ముకుంటే… తాము క్యారెక్టర్, కెపాసిటీని న‌మ్ముకున్నామ‌న్నారు సంజయ్..

ప్రెస్ మీట్ వివ‌రాలు బండి మాటల్లోనే..

‘‘ఈ రోజు వెల్లడైన సర్వేల ప్రకారం బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నడు. ఈ విషయం తెలిసి సీఎం కేసీఆర్ హైబత్ తిన్నడు. ఓటుకు రూ.20 వేలు పంచుతున్నడు. బీజేపీ ఎక్కడా అడ్డుకోవడం లేదు. ఎందుకంటే ఆ డబ్బులన్నీ ప్రజలవే. కనీసం పేదలైనా బాగుపడతరు కదా…

టీఆర్ఎస్ ఫేక్ లెటర్ సృష్టిస్తోంది. నమస్తే తెలంగాణ బూతు పేపర్ లో రాస్తోంది. టిష్యూ కన్నా అధ్వాన్నం. నకల్ కొట్టడానికైనా అకల్ కొట్టాలి. అడ్రస్ హైదరాబాద్ ది పెట్టి.. పిన్ కోడ్ నెంబర్ కరీంనగర్ పెట్టిండ్రు. తప్పుడు ప్రచారంతో ప్రజలను అయోమయం చేయడానికి టీఆర్ఎస్ కుట్ర. వారి గోతిలో వాళ్లే పడతరు.

హుజూరాబాద్ ప్రజలారా.. వరి కావాలా? ఉరి కావాలా?… వరి కావాలంటే బీజేపీకి ఓటేయండి.. ఊరి కావాలంటే.. టీఆర్ఎస్ కు ఓటేయాలి. కేసీఆర్ తాలిబన్ లా మారిండు. వరి వేస్తే సీడ్ దుకాణాలను సీజ్ చేస్తామని కలెక్టర్లు బెదిరిస్తున్నరు. సిగ్గుండాలి. ఎవరిచ్చిండ్రు మీకు అధికారం? బరితెగించి మాట్లాడతారా?

- Advertisement -

సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినా పట్టించుకోడట.. ఈయనో పోటుగాడు. ఎఫ్ సీఐ కొనడం లేదని ఖమ్మం కలెక్టర్ అబద్దాలు చెబుతున్నడు. కేసీఆర్ కాళ్లు మొక్కితే.. ఏదైనా మాట్లాడొచ్చని అనుకుంటున్నరు. వీళ్లపై చట్ట, న్యాయపరంగా పోరాడతాం. నువ్వెవరు వరి గురించి మాట్లాడటానికి కేసీఆర్… వరి ధాన్యం మొత్తం కొనేది కేంద్రమే. నువ్వు బ్రోకర్ వి మాత్రమే.

రైతులను బెదిరిస్తే.. నీ సంగతేందో చూస్తాం… గల్లా పట్టి కొనిస్తాం. ఈ విషయంలో మేం జైలుకు పోయేందుకు మేం సిద్ధం. కేంద్రం- రాష్ట్రం మధ్య ధాన్యం కొనుగోలు విషయంలో ఒప్పందం కుదిరిన మాట వాస్తవం కాదా? (ఇదిగో ఒప్పంద పత్రం..) పోయినసారి యాసంగిలో 95 లక్షల మెట్రిక్ టన్నులు, వానాకాంలో 60 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా పంట మొత్తం కొన్నది కేంద్రమే. ఈసారి కూడా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. సీఎం స్పష్టం చేయాలి.

కేసీఆర్ చెంప చెళ్లుమన్పించాలంటే.. హుజూరాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పాలి. ఇంకోసారి సీఎం రైతుల గురించి మాట్లాడాలంటే హుజూరాబాద్ ప్రజలే గుర్తుకురావాలి. సీఎంకు సోయి లేదు… ఏం మాట్లాడుతుందో అర్ధం కావడం లేదు. కేసీఆర్ తాలిబన్ రాజ్యం రావాలనుకుంటున్నరు. బీజేపీ రామరాజ్యం కోసం పోరాడుతోంది. రైతులారా.. సీఎం మాటలు పట్టించుకోకండి. వరి పంట వేయండి. మొత్తం ధాన్యాన్ని కొనిపించే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది.

పెట్రోలు, గ్యాస్ ధరల పెంపుపై… దేశంలో, రాష్ట్రంలో మహిళల్లో ఏ ఒక్కరూ పొయ్యి పెట్టొద్దని.. గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చాం. తెలంగాణలో 10 లక్షలకుపైగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత నరేంద్రమోదీదే.. పెట్రోలు ద్వారా ఒక్కో లీటర్ కు వ్యాట్ ద్వారా రూ.26లకు పైగా.. కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా రూ.14లకుపైగా పైసలొస్తున్నయ్. మొత్తం లీటర్ పెట్రోలుకు రూ.41లను కేసీఆర్ దొబ్బిపోతున్నడు. కేంద్రంపై నిందలేస్తున్నడు సిగ్గులేకుండా… మేనిఫెస్టోపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై… ఆయనే ఒక జోకర్. అగ్గిపెట్టే మంత్రి..’’ అని బండి సంజ‌య్ విమ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement