Friday, May 10, 2024

నిండు గ‌ర్భంతో స్టెప్పులేసిన యువ‌తి..వైర‌ల్ గా వీడియో..

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఈ మ‌ధ్య ఏ వార్త వ‌చ్చినా అది తెగ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఓ మ‌హిళ చేసిన ప‌ని కూడా తెగ వైర‌ల్ అవుతోంది.. ప్రెగ్నెన్సీ అనేది ఎంతో సున్నిత‌మైన విష‌యం..ప్రెగ్నెన్సీ క‌న్ఫాం అయిన ద‌గ్గ‌ర నుంచి ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంటారు మ‌హిళ‌లు..క‌ద‌ల‌కూడ‌దు..బ‌య‌ట తిర‌గ‌కూడ‌దు అనే రూల్స్ ని పెడుతుంటారు పెద్ద‌లు. అయితే ఇక్క‌డ ఓ యువ‌తి నిండు గ‌ర్భంతో స్టెప్పులేసింది. వివ‌రాల్లోకి వెళ్తే నెలలు నిండిన గర్భంతో డ్యాన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఓ మహిళ. సీమంతం వేడుకల్లో భాగంగా శ్రీలంక ర్యాప్‌ సింగర్‌ యోహాని డిసిల్వా పాడిన ‘మాణికె మాగె హితే’ పాటకు అద్భుతంగా కాలు కదిపి అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

ఈ వీడియోలో కృష్ణ మాధురి అనే మహిళ పట్టుచీర, ఒంటినిండా ఆభరణాలు ధరించి తన బేబీబంప్‌ను ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేసింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఆమె…’ ఎట్టకేలకు నేను అనుకున్నది సాధించాను. ఇది నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇలా నెలలు నిండిన సమయంలో డ్యాన్స్‌ చేయడం వల్ల గర్భిణితో పాటు కడుపులోని బిడ్డకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని రాయ‌డం విశేషం. అంతేకాదండోయ్ గర్భిణులు పాటించాల్సిన జాగ్రత్తలను కూడా పంచుకుంది. ‘గర్భం ధరించడమనేది ఒక్కో మహిళకు ఒక్కో విధంగా ఉంటుంది. వ్యాయామాలు, ఎక్సర్‌సైజులు చేయడం ప్రారంభించేముందు ఖ‌చ్చితంగా వైద్యులను సంప్రదించాలి. నా విషయానికొస్తే…వైద్యపరంగా నాకెలాంటి సమస్యలు లేవు. డ్యాన్స్‌ చేసేటప్పుడు ఎంతో సౌకర్యంగా ఫీలయ్యాను. అయితే అంతకంటే ముందే కాలు కదపడానికి డాక్టర్ల అనుమతి తీసుకున్నాన‌ని చెప్పింది.

అయితే నెటిజన్లు కూడా ఈ వీడియోపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘సూపర్‌ యాక్టివ్‌’, ‘రాక్‌స్టార్‌’ ‘లవ్లీ’ అని ప్రశంసిస్తూనే ‘జాగ్రత్తగా ఉండండి మేడమ్‌’ అని కామెంట్స్ చేస్తున్నారు. అస‌లే గ‌ర్భ‌వ‌తి.దానికి తోడు నెల‌లు నిండాయి..ఇలాంటి స‌మ‌యంలో స్టెప్పులు వేయ‌డం అంటే అంత ఈజీ కాదంటున్నారు ప‌లువురు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో..ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement