Tuesday, May 7, 2024

Porn videos : కాల్ మనీ వేధింపులపై యువతి తిరుగుబాటు.. షీ టీమ్స్ కు ఫిర్యాదు

హైదరాబాద్ నడిబొడ్డున కాల్ మనీ తరహా ఘటన మరోటి చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదని యువతితో శృంగారంలో పాల్గొన్న యువకుడు.. ఆ తర్వాత న్యూడ్‌ వీడియోలు తీసి ఆ యువతిని బెదిరించాడు. అప్పు తీర్చే పరిస్థితి లేకపోవడంతో తన కోరిక తీర్చాలని బాధితురాలిపై యువకుడు ఒత్తిడికి దిగాడు. గత్యంతరం లేక యువకుడితో శృంగారంలో పాల్గొనేందుకు యువతి అంగీకారం తెలిపింది. ఈ తరుణంలోనే.. యువతికి తెలియకుండా రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు ఆ నిందితుడు.

ఆ మరుసటి రోజు నిందితుడు తన స్నేహితులకు వీడియోలు చూపించాడు. తనతో కూడా గడపాలని యువతికి వీడియో పంపారు నిందితుడి స్నేహితులు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని బాధితురాలిని బెదిరింపులకు దిగారు. యువతి అంగీకరించకపోవడంతో నిందితులు వీడియోలు వైరల్ చేశారు. దీంతో బాధితురాలు మానసిక క్షోభ భరించలేక షి టీమ్స్ ను ఆశ్రయించింది. నారాయణగూడ పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement