Sunday, December 8, 2024

HYD: ఎల్బీనగర్ లో పసుపు జెండా ఎగరేస్తాం : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీ కృష్ణ ప్రసాద్

హైదరాబాద్ తూర్పు ప్రతినిధి, ఆగస్టు24: ఎల్బీనగర్ నియోజకవర్గంలో తెదేపా బలమైన శక్తిగా ఉందని, పసుపు జెండ ఎగరేస్తామని నియోజకవర్గం ఇంచార్జ్, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీ కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన హయత్ నగర్ డివిజన్ కు చెందిన నూతన కమిటీని ప్రకటించారు. డివిజన్ కమిటీ నూతన అధ్యక్షునిగా మరాఠీ బిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా జెంగిలి కుమార స్వామి యాదవ్ తో పాటు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్వికే మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో కూడా ఎల్బీనగర్ లో టీడీపీకి తిరుగులేదని గుర్తు చేశారు. గతంలో ఆర్ కృష్ణయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని, గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతోనే ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విజయం సాధించాడని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ టీడీపీ వెంటే ఉంటారన్నారు. ప్రతి టీడీపీ సైనికులు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రజలతో మమేకమై టీడీపీ విధానాలను వివరించాలని ప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎలమంచిలి వెంకట గాంధీ, తెలంగాణ తెలుగు యువత అధికార ప్రతినిధి సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి, నాయకులు సురేష్ నాయుడు, కరణ్ చౌదరి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement