Sunday, May 5, 2024

తెలంగాణ సాధించుకున్నట్టే.. కోచ్ ఫ్యాక్టరీని సాధించుకుంటాం..

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో రైల్ రోకో ఎంతో ఉపయోగపడిందని తెలిపారు అరుణోదయ నేత విమలక్క. రైల్వే కోచ్ ఇక్కడి వాళ్ల అందరి స్వప్నమని చెప్పారు. ఇందిరా పార్క్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో జరిగే పోరాటంలోను అరుణోదయ టీమ్ మద్దతు ప్రకటించిందని విమలక్క తెలిపారు. తెలంగాణ సాధించుకున్నట్టే.. కోచ్ ఫ్యాక్టరీని సాధించుకుంటామని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ స్పష్టం చేశారు. ఇది కేవలం వరంగల్ సమస్య కాదని యావత్ తెలంగాణదని వినయ్‌భాస్కర్‌ చెప్పారు. అసెంబ్లీలో కోచ్ ఫ్యాక్టరీపై తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లి ఒత్తిడి తేవాలన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కొట్లాడే వాళ్ళకే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని వెంకట్ రెడ్డి పిలుపు ఇచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement