Wednesday, May 1, 2024

మ‌ళ్లీ తెర‌పైకి అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం..

హైదరాబాద్‌, : భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ కేసు దర్యాప్తును సీబీఐ పునర్విచారణ చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలుస్తామని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (టీసీఎ) అధ్యక్షుడు యెండల లక్ష్మినారాయణ తెలిపారు. టీసీఎ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మినారాయణతో పాటు కార్యదర్శి గురవారెడ్డి, బోర్డు సభ్యుడు కల్నల్‌ ప్రగతికుమార్‌ తదితరులు మాట్లాడారు. క్లీన్‌ చిట్‌ లేని వ్యక్తి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఎ)ను భ్రష్టు పట్టిస్తున్నారని మండి పడ్డారు. ఆడిట్‌ లేని కారణంగా ఐపీఎల్‌ను నిర్వహించేందుకు నిరాకరించా రన్నారు. ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీ సెలక్షన్‌లో అనేక ్వకతవకలు జరిగాయన్నారు. రంజీ క్రికెట్‌ ఎంపికలోనూ అనేక అక్రమాలు జరుగుతున్నా యన్నారు. అజరుద్దీన్‌ కేవలం ఎన్నికల్లో పోటీ చేసేందుకు కోర్టు నుంచి తాత్కాలిక అనుమతి మాత్రమే తెచ్చుకున్నారని అన్నారు. తనపై ఉన్న మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అభియోగాల నుంచి అజర్‌ తప్పించుకోలేరన్నారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో బీసీసీఐ నుంచి అజర్‌కు క్లీన్‌ చిట్‌ లభించలేదని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ్‌ హజారే ట్రోఫీల సెలక్షన్‌లోనూ అనేక అక్రమాలు జరిగాయన్నారు. లీగ్‌ మ్యాచ్‌లలో మంచి ప్రతిభ కనబరచిన ఆటగాళ్ళకు చోటు లేకుండా పోయిందన్నారు. హెచ్‌సీఎలో కేవలం తొమ్మిది సంవత్సరాలకు మించి పదవులలో కొనసాగరాదన్న నిబంధన ఉన్నప్పటికీ గడచిన20 సంవత్సరాలుగా కొంత మంది రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement