Tuesday, May 14, 2024

కరోనా కాటుకు 27 లక్షల మంది బలి..

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి గత సంవత్సరం నుంచి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి భారిన పడి ప్రపంచవ్యాప్తంగా 27 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మాయా రోగం ఇప్పటివరకు 27,09,627 మందిని బలితీసుకుందని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్ తెలిపింది. అంతేకాదు ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 12,28,12,281కి చేరుకుంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 8,177 మంది మృత్యువాత పడ్డారు. .అన్ని దేశాలకంటే ఎక్కువగా అమెరికాలో ఎక్కువగా 2,97,80,301 మంది కరోనా భారిన పడ్డారు. ఇప్పటి వరకు 5,41,907 మంది అమెరికాలో కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.

ఇక భారత్ లోను కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తుండగా మరికోన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించేందుకు సిద్దమవుతున్నాయి. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంది. వైరస్ రెండోసారి విజృంభిస్తుండడంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement