Tuesday, April 30, 2024

ఈ రక్షాబంధన్‌కు… బహుమతిగా బాదములను అందించండి..

పండుగ సీజన్‌ ప్రారంభానికి సూచికగా నిలిచే మరో మాసమిది. దేశవ్యాప్తంగా కుటుంబాలన్నీ కూడా అత్యంత ఆసక్తిగా రక్షాబంధన్‌ పండుగ వేడుక చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. మనం అభిమానించే వారి ఆరోగ్యం, శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఈ రక్షాబంధన్‌ వేళ, మన బంధాన్ని బలోపేతం చేసుకుంటూ ఓ బాక్స్‌ నిండుగా ఆరోగ్యాన్ని బాదముల బాక్సును బహుమతిగా ఇవ్వడం ద్వారా అందించండి.

న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… వేడుక, ఆచారం, షాపింగ్‌, అధికంగా స్నాక్స్‌, స్వీట్ల ఆరగింపు రక్షాబంధన్‌ వేళ కనిపిస్తుందన్నారు. ఈ పండుగ సీజన్‌లో, మీరు అందించే బహుమతుల గురించి పునరాలోచించడంతో పాటుగా పరిశీలించాల్సిందిగా తాను అభ్యర్ధిస్తున్నానన్నారు. స్వీట్లు లేదా ఫ్రై చేసిన పదార్థాలకు బదులుగా బాదములను మీ తోబుట్టవులకు అందించాల‌న్నారు. ఇవి ఆలోచనాత్మక బహుమతిగా నిలుస్తాయన్నారు. ఇవి దీర్ఘకాలంలో వారి ఆరోగ్యానికి సైతం తోడ్పడతాయన్నారు. వీటితో పాటుగా, బాదములలో అధిక మొత్తంలో బీ2 లేదా రిబోఫ్లావిన్‌ ఉంటుందన్నారు. శక్తి ఉత్పత్తి చేయడంలో, మనం తీసుకున్న ఆహారాన్ని ఇంధనంగా మార్చడంలో ఇది అందరికీ తెలిసిన విటమిన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement