Wednesday, May 1, 2024

ప్ర‌భుత్వ‌, ప్రైవేటు హాస్ప‌ట‌ల్స్ లో భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు అప్ డేట్ చేయండిః కెసిఆర్ ఆదేశాలు..

హైద‌రాబాద్ : ‌వివిధ రాష్ట్రాల‌లోని హాస్ప‌ట‌ల్స్ లో త‌ర‌చుజ‌రుగుతున్న అగ్ని ప్ర‌మాదాల‌తో కెసిఆర్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది… తెలంగాణ‌లోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు హాస్ప‌ట‌ల్స్ లో తీసుకోవ‌ల‌సిని భ‌ద్ర‌తాచ‌ర్య‌ల‌పై స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్య‌మంత్రి కెసిఆర్. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్ల‌లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలని కోరారు. ప్ర‌స్తుతం వేస‌వి కాలం కావ‌డం, దీనికి తోడు అన్ని ఆస్ప‌త్రులు క‌రోనా రోగుల‌తో నిండి ఉన్న నేప‌థ్యంలో అగ్నిప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌న్నారు. రోగులు ఎక్కువ ఉన్న గాంధీ, టిమ్స్ లాంటి ఆస్ప‌త్రుల్లో ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఫైరింజ‌న్లు అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. అలాగే ప్రైవేటు హాస్ప‌ట‌ల్స్ లో సైతం అగ్నిమాప‌క యూనిట్ల‌ను ఉంచేలా చూడాల‌ని ఆదేశించారు.. అలాగే యుద్ద విమానాలలో వ‌స్తున్న ఆక్సిజన్‌ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ కి చేరేవిధంగా సమన్వయం చేసుకోవాలని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో పరీక్షలు చేయించుకొనే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా పెరగడంతో కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొరత ఏర్పడకుండా చూడాల‌ని వైద్య‌,ఆరోగ్య శాఖ‌ను ఆదేశించారు. కిట్స్ ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా వాటిని మన రాష్ట్రానికి తెచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోం ఐసోలేష‌న్‌ కిట్స్ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ మానిట‌ర్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని లక్షల మందికి అయిన హోం ఐసోలేష‌న్‌ కిట్స్ అందించడానికి వీలుగా కిట్స్ ను సమకూర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement