Friday, May 17, 2024

కేజీఎఫ్ 2 మరో రికార్డ్ !

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం కే జి ఎఫ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా సినీ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా చాలా టైం ఉండగానే బుక్ మై షో లో మూడు లక్షల మందికిపైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ విధంగా రికార్డ్ క్రీయేట్ చేయలేదట. కాగా ఈ సినిమా మూవీ లవర్స్ ఏ స్థాయిలో వైట్ చేస్తున్నారో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement