Wednesday, May 1, 2024

HYD: ఫెటిలైజర్ యూనిట్ పై SOT దాడులు..

అబ్దుల్లా పూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగుడాలో డిఫరెంట్ పేర్లతో, ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయ బయోస్టిమ్యులెంట్ తయారు చేస్తున్న ఫెటిలైజర్ యూనిట్ పై వ్యవసాయ అధికారులతో పాటు ఎల్బీనగర్ SOT పోలీసులు దాడులు చేశారు. హయత్ నగర్ కుంట్లూర్ కు చెందిన ఉప్పతి ఏడుకొండల్ రెడ్డి ని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. రూ.5 లక్షల విలువజేసే వ్యవసాయ మందులను స్వాధీనం చేసుకొని, కేసు దర్యాప్తు కోసం హయత్ నగర్ పోలీసులకు ఎస్ఓటీ పోలీసులు అప్పజెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement