Tuesday, April 30, 2024

HYD: ఐఎన్‌టీఎస్‌ఓ రెండవ దశ ఫలితాల్లో జూబ్లిహిల్స్‌ శ్రీ చైతన్య విజయభేరి

హైదరాబాద్‌ : ఇటీవల వెలువడిన ఐఎన్‌టీఎస్‌ఓ రెండవ దశ ఫలితాల్లో జూబ్లిహిల్స్‌లోని శ్రీ చైతన్య సీబీఎస్‌ఈ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారు.విశిష్ట బహుమతి కింద 6వతరగతి విద్యార్థి నిఖిలేశ్‌ ఆదిత్య లెనోవా లాప్‌టాప్‌ గెల్చుకోగా, మొదటి బహుమతిగా లెనోవా ట్యాబ్‌ ను 5వ తరగతి విద్యార్థి తరుణ్‌, మూడవ బహుమతిగా వాచ్‌ ను 3వతరగతి విద్యార్థి వంశీమోహన్‌, నాల్గవ బహుమతిని 7వ తరగతి విద్యార్థిని దిశిత, 9వ తరగతి విద్యార్థిని హర్షిత వల్లిలు సంయుక్తంగా గెల్చుకొన్నారు.

ఇంకా 5వ బహుమతిని 8వ తరగతి విద్యార్థి అక్షిత్‌ శ్రీరామ్‌, 10వ తరగతి విద్యార్థి దీప్‌ పాటిల్‌ లు, ఇవేకాక 33మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రత్యేక ప్రశంస క్రింద కన్సలేషన్‌ బహుమతుల్ని, 66 మంది విద్యార్థినీ విద్యార్థులు సింజనీ, పూజాన్వితలు బంగారు పతకాలను, ప్రశంసా పత్రాలను కైవసం చేసుకొన్నారు. వీరందరికీ పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నిరోష చేతుల మీదుగా బహుమతుల్ని అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ… పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థినీ విద్యార్థులను అభినందిస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శివరామకృష్ణ, ఆర్‌ఐ అనిత, కోఆర్డినేటర్‌ జయకుమార్‌, డీన్‌ శ్రీనివాస్‌, సీ/ఎం ఇన్‌ఛార్జి సత్యనారాయణ, సివిల్స్‌ ఇన్‌ఛార్జి ప్రణీత్‌, ఒలంపియాడ్‌ ఇన్‌ఛార్జిలు మౌనిక, మహేశ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement