Thursday, May 16, 2024

PBKS vs SRH | టాస్ గెలిచిన పంజాబ్…

ఐపీఎల్‌లో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్లు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇక పంజాబ్ హోం గ్రౌండ్ మహారాజా యదవీంద్ర స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది.

జ‌ట్ల వివ‌రాలు :

సన్‌రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టీ నటరాజన్.

పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (c), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, జితేష్ శర్మ (WK), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.

ఈ సీజన్‌లో ఇరు జట్లకు ఇది ఐదో మ్యాచ్ కాగా, ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయం సాధించాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి మూడో విజయాన్ని అందుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకుంది. పంజాబ్ కూడా తన చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. గత మ్యాచ్‌లో తమ ప్రత్యర్థులను ఓడించిన ఈ రెండు జట్లూ ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement