Thursday, May 2, 2024

పార్టీ ఏర్పాటు కోసం స్పీడ్ పెంచిన ష‌ర్మిల‌..

హైదరాబాద్‌, : తెలం గాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్న వైయస్‌ షర్మిల వేగం పెంచారు. కొత్త పార్టీకి ‘వైయస్సార్‌ తెలం గాణ పార్టీ’గానే నామకరణం చేసినట్టు తెలుస్తుండగా, దీనికి సంబంధించి ఢిల్లి లోని ఎన్నికల కార్యాల యంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా పూర్తయినట్టు విశ్వసనీ యంగా తెలుస్తోంది. అయితే పార్టీ పేరుపై ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఇదే పేరును వీరికి కేటాయించే అవకాశం ఉంది. పార్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రతిరోజు లోటస్‌పాండ్‌లో తన ముఖ్య అనుచరులతో చర్చలు జరుపుతుండ డంతో పాటు జిల్లాల వారీగా ఉన్న గత నాయకులు, తాజా మాజీ నేత లపై దృష్టి సారించారు షర్మిల. దీంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నేతలు, అభి మానులు లోటస్‌పాండ్‌కు రావ డం, షర్మిలను కలిసి వారి మద్ధతు తెలుపుతుండడంతో పార్టీ ప్రకటనకు ముందే పెట్టబోయే పార్టీకి స్పందన లభిస్తోందని లోటస్‌ పాండ్‌ వర్గీయులు చెెబుతున్నారు. షర్మిల పెట్ట బోయే పార్టీకి సంబంధించి పార్టీ ప్రకటన, విధివి ధానాలను ఏప్రిల్‌ 9న ఖమ్మం సభ వేదికగా ఆమె ప్రజలకు తెలపనున్నారు. పైగా ఆరోజు నుంచే ఆమె ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు.
పార్టీకి సంబంధించి జిల్లాల నేతలతో ఆత్మీయ సమ్మేళనం పేరిట నిర్వహిస్తున్న సమావేశాల ద్వారా షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొదటి, రెండు సమ్మేళనాల్లో ఆయా జిల్లాల నేతలతో చర్చిం చిన అనం తరం రాష్ట్ర పరిస్థితులపై స్పందించకుండా, నేతలు, అభిమానులతో ముచ్చటించేవారు. కానీ కొద్ది రోజు లుగా జరుగుతున్న సమ్మేళనాలను పరిశీలిస్తే ప్రభు త్వంపై విమర్శలు చేస్తూ, ఇచ్చిన హామీలు ఏమ య్యా యంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు తెలం గాణలో వైయస్‌ హాయాంలో జరిగిన అభివృద్ధిని ఆయా జిల్లాల నేతలు, అభిమానులకు గుర్తుచేస్తు న్నారు.
ఏప్రిల్‌ 9న ఖమ్మంలో నిర్వహించబోయే సభలో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటన, పార్టీ యొక్క విధివిధానాలను ప్రకటించనున్నారు. పార్టీ ఆవిష్క రణ వైయస్సార్‌ జయంతి సందర్భంగా జులై 8న ఉండనుంది. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఫిబ్రవరి నుంచే షర్మిల అండ్‌ టీం కసరత్తులు చేస్తున్న ప్పటికి ముందు క్షేత్రస్థాయిలోని పరిస్థితులపై అవగాహాన పెంచుకోవడంతో పాటు అన్ని జిల్లాల వారితో చర్చలు జరిపిన తరువాత పార్టీ ప్రకటన చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోనే ఆమె ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ముందుగానే కమిటీలను నియమిస్తున్నారు.
రాజన్న సంక్షేమ పాలన కోసమే పార్టీ..
ఖమ్మంలో ఏప్రిల్‌ 9న తలపెట్టిన సభ ఎన్నడూ జరగని విధంగా జరగాలని షర్మిల అనుచరులను ఆదేశించారు. ఇం దుకు సంబంధించి ఖమ్మం జిల్లా నేతలతో పాటు, తన ముఖ్య అనుచరులతో సమా వేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి సం బంధించి తొలి సభ కావడంతో భారీగా ఉండాలని ఏర్పా ట్లపై ఆమె కూడా ఫోకస్‌ పెట్టారు. పార్టీకి సంబంధించి తొలిసారి జర గబోతున్న సభకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు వచ్చేలా, లక్ష మందికి పైగా సభకు వౖచ్చేలా జనసమీ కరణ జరగాలని ఆమె అనుచరులకు తెలిపారు. దీనికి సంబంధించి ఆమె అను చరులు ప్లాన్‌ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే షర్మి ల ఏర్పాటు చేయబోయే పార్టీపై రాజ కీయంగా పలు విమ ర్శల కు దారితీస్తున్న నేపథ్యంలో తెలంగాణలో మళ్లిd రాజన్న సంక్షేమ పాల‌న రావాలన్న లక్ష్యంతోనే పార్టీని ఏర్పాటు చేసున్నాను కానీ, షర్మిలమ్మ రాజ్యం కోసం కాదంటూ ఆమె స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement