Sunday, December 8, 2024

పవన్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా బన్నీ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ కేజిఎఫ్ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా బన్నీ చేయబోతున్నాడని తెలుస్తుంది.

ఈ రెండు సినిమాల తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ మూవీ చేయనున్నాడట. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ కుదరలేదు. ఎట్టకేలకు ఈ సినిమాను పట్టా లెక్కించేందుకు బన్నీ రెడీ అవుతున్నాడట. ఇక ప్రస్తుతం వేణు శ్రీరామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement