Monday, May 20, 2024

సమంత ప్రచారకర్తగా నూతన టీవీసీ విడుదల చేసిన ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌

విస్తృతశ్రేణిలో వంటనూనెలు, ఆహార ఉత్పత్తులను ఫార్చ్యూన్‌ బ్రాండ్‌ కింద విడుదల చేస్తోన్న అదానీ విల్మర్‌ లిమిటెడ్‌ ఇప్పుడు ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ నూతన టీవీ కమర్షియల్‌ (టీవీసీ)ను దక్షిణాది నటి సమంత ప్రభు నటించగా విడుదల చేసింది. ఈసంద‌ర్భంగా అదానీ విల్మార్ వైస్‌ ప్రెసిడెంట్‌– సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్ ముకేష్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ… దక్షిణాది చిత్రాలలో ప్రాచుర్యం పొందిన నటి సమంత ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఆమె కీర్తిగడించారన్నారు. త‌మ బ్రాండ్‌ ప్రచారకర్తగా ఆమె దక్షిణాది మార్కెట్‌లలో వినియోగదారులను కనెక్ట్‌ అయ్యేందుకు తోడ్పడనున్నారన్నారు. అదానీ విల్మర్‌ తో భాగస్వామ్యం గురించి నటి సమంత ప్రభు మాట్లాడుతూ… ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కోసం అదానీ విల్మర్‌ తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నానన్నారు. ఫిట్‌నెస్‌ ప్రియురాలిగా, ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యాన్ని సహజంగానే ఇష్టపడ్డానన్నారు. ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ తేలిగ్గా ఉండటంతో పాటుగా భోజనం అధికంగా తీసుకున్నప్పటికీ తేలిగ్గా ఉందన్న భావన అందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement