Wednesday, May 8, 2024

ఈవేస్ట్‌ ఛానలైజేషన్‌ పై ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌, జీఐజెడ్‌ ఇండియా వర్క్‌షాప్‌

డ్యూయిష్‌ గెసెల్స్‌ చాఫ్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ జుసమ్మెనార్‌బీట్‌ (జీఐజెడ్‌) ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ లు ఈ సఫాయీ కార్యక్రమంగా గుర్తింపు పొందిన ఈ–వ్యర్ధాల నిర్వహణ కోసం సృజనాత్మక వాల్యూచైన్‌ను ఏర్పాటు చేయడం శీర్షికన మూడు సంవత్సరాల పాటు సాగే పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం అమలు చేయడానికి చేతులు కలిపాయి. ఈ వర్క్‌షాప్‌ గురించి జీఐజెడ్‌ ఇండియా సర్క్యులర్‌ ఎకనమీ అండ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ సీనియర్‌ ఎడ్వైజర్‌ గౌతమ్‌ మెహ్రా మాట్లాడుతూ… కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సుదీర్ఘకాలంగా నిబంధనల అమలుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈపీఆర్‌ పాలసీకి కట్టుబడి ఉండటం ద్వారా ఛానలైజేషన్‌కు సహాయపడుతుందన్నారు. ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధికా కాలియా మాట్లాడుతూ…ఈపీఆర్‌ పాలసీ విజయం సాధించాలంటే వాటాదారులు తమ బాధ్యతలను గుర్తించడంతో పాటుగా మార్గదర్శకాలను అనుసరించడం చేయాలన్నారు. ఈపీఆర్‌ విధానాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నియంత్రిస్తుందన్నారు. అయితే భూగోళానికి నిలకడతో కూడిన భవిష్యత్‌ కావాలంటే మాత్రం వాటాదారులు తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement