Thursday, May 2, 2024

HYD: రిస్తోం కా లైవ్ టెలికాస్ట్ అనేది ప్రతి కుటుంబానికి సంబంధించినది : హిమానీ శివపురి

హైదరాబాద్: రిస్తోం కా లైవ్ టెలికాస్ట్ అనేది ప్రతి కుటుంబానికి సంబంధించినదని ప్రముఖ టెలివిజన్ అండ్ చలనచిత్ర నటి హిమానీ శివపురి అన్నారు. హిమానీ శివపురి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి అయినందున స్టేజ్‌తో ఆమెకు బలమైన అనుబంధం ఉంది. జీ థియేటర్ టెలిప్లే రిస్తోం కా లైవ్ టెలికాస్ట్ లో పనిచేయడం, ఆమె తన మూలాలతో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి, తనను తాను బలంగా ప్రతిధ్వనించే పాత్రను పోషించడానికి ఆమెకు చక్కటి అవకాశంగా నిలిచించి. చక్కటి ఈ కుటుంబ నాటకం ఇప్పుడు కన్నడ అండ్ తెలుగులోకి అనువదించబడినందుకు ఆమె సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. రిస్తోం కా లైవ్ టెలికాస్ట్ ప్రతి కుటుంబంతో మరీ ముఖ్యంగా వారు ఏ ప్రాంతానికి చెందిన వారైనా కనెక్ట్ అవుతుందన్నారు.

కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని థియేటర్ ప్రేమికులు దీనిని అభిమానిస్తారని ఆశిస్తున్నానన్నారు. స్టేజిపై అనేక శక్తివంతమైన పాత్రలు పోషించిన నటి, ఏప్రిల్ 27న డిష్ టీవీ రంగ్‌మంచ్ యాక్టివ్, డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్ అండ్ ఎయిర్‌టెల్ స్పాట్‌లైట్‌లలో ప్రదర్శించబడే టెలిప్లేలో కీలకమైన పాత్రను పోషించారు. తన పాత్ర గురించి హిమానీ మాట్లాడుతూ… తాను దేనికి చలించని తల్లిగా నటించానన్నారు. ఈ టెలిప్లే చూస్తున్న మ‌హిళ‌లందరూ ఈ పాత్రతో తమను తాము చూసుకుంటారన్నారు. కుటుంబ ప్రేమ మాత్రమే క్లిష్ట సమయంలో మనల్ని నిలబెడుతుందని ఇది వెల్లడిస్తుందన్నారు. సోషల్ మీడియా, యాప్ లతో కనెక్ట్ అయిన యువతకు మనం మానవ సంబంధాన్ని కోల్పోతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోమని టెలిప్లే ప్రోత్సహిస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement