Monday, April 29, 2024

LSG vs CSK | ఆదుకున్న దోనీ, జ‌డేజా.. ల‌క్నో టార్గెట్ ఎంతంటే

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ల‌క్నో ఎకానా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తడబాటుకు గునైంది. ఈ మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ బౌల‌ర్ల ధాటికి సీఎస్కే కీల‌క ఆట‌గాళ్లంతా వ‌చ్చిన వాళ్లు వ‌చ్చిన‌ట్టు పెవిలియ‌న్ చేరారు. అయితే, ఆఖర్లో రవీంద్ర జడేజా.. ధోనీ చెలరేగడంతో సీఎస్‌కే 6 వికెట్ల నష్టానికి176 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రవీంద్ర జడేజా 57 (నాటౌట్) హాఫ్ సెంచరీ బాదాడు. ధోని 9 బంతుల్లో 28 పరుగులు (నాటౌట్) మెరురపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా… మొహ్సిన్ ఖాన్, యష్ రవిసింగ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిస్ తలో వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement