Sunday, December 8, 2024

HYD: నా ప్రాణం ఉన్నంతవరకు కూక‌ట్‌ప‌ల్లి ప్రజలను కాపాడుకుంటా.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

శనివారం కూకట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కెపిహెచ్‌పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో డివిజన్ కు సంబంధించిన అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తనను రాష్ట్రంలోనే రెండవ భారీ మెజార్టీ సభ్యునిగా గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే కేపిహెచ్బి డివిజన్లోని కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు కూడా గెలుపులో కీలక పాత్ర వహించారని వీళ్ళందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకుని వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించి నేడు అభివృద్ధికి మారుపేరుగా కూకట్‌ప‌ల్లి నియోజకవర్గంను తీర్చిదిద్దామని, ఇకముందు కూడా పార్టీలు ఏమైనా సరే అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళతామన్నారు. నా ప్రాణం ఉన్నంతవరకు కూకట్‌ప‌ల్లి నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటానని అన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కృషి చేస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement