Sunday, May 5, 2024

PhonePe Indus Appstoreలో 1 మిలియన్ దాటిన యాప్ ఇన్‌స్టలేషన్లు..

హైదరాబాద్ : ఆవిష్కరించిన నెలరోజుల్లోపే 10 లక్షలకు పైగా ఇన్‌స్టలేషన్లు జరిగాయని భారతదేశపు స్వదేశీ యాప్ మార్కెట్ ప్లేస్ అయిన PhonePeకు చెందిన Indus Appstore నేడు ప్రకటించింది. Indus Appstoreలోని ఈ త్వరితగతి స్వీకరణ, భారత డెవలపర్లకు ప్రాధాన్యత ఇచ్చి, భారతీయ యూజర్ల భాషా, సాంస్కృతిక అభీష్టాలను నెరవేర్చే ప్రత్యామ్నాయ మార్కెట్ సంసిద్ధతతను సూచిస్తోంది. ఈ మైలు రాయిని చేరుకోవడంపై , Indus Appstore కో-ఫౌండర్, CPO ఆకాశ్ దోంగ్రే మాట్లాడుతూ… “ఈ అద్వితీయమైన సాధన అనేది మా జట్టు దృఢమైన సంకల్పం, కఠోరశ్రమను ప్రతిబింబిస్తోంది. ఇటు డెవలపర్లు, అటు వినియోగదారులు ఇరువురికీ ఒక మెరుగైన ఉత్పత్తి ఎక్స్‌పీరియన్స్‌ను అందించడంలో ఇలాగే ముందు నిలిచేలా కొత్త హంగులను నిరంతరం కొనసాగిస్తూ, మా యాప్‌స్టోర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుస్తూ ఉంటాము. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భారతదేశంలో యాప్ డిస్కవరీ భవిష్యత్ గురించి మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము.” అని అన్నారు.

Indus Appstore ప్రతి 10 రోజులకు కొత్త కొత్త అప్‌డేట్లు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఒకవైపు యూజర్ల వినియోగాన్ని క్రమబద్ధీకరించి, మరింత సులభతరం చేసేలా వీడియో ఆధారంగా యాప్‌ పనితీరును తెలుసుకోవడం, వాయిస్ సెర్చ్ లాంటి ఫీచర్లు ఇప్పటికే సిద్ధమవుతుండగా, గొప్ప వర్తక ఉపకరణాలు, వీడియో ఆధారిత యాప్ ప్రమోషన్ అవకాశాలు లాంటి డెవలపర్ ఉపకరణాలు రూపకర్తలకు లాభాల పంటను పండింపచేస్తాయి. Nokia, Lavaలతో Indus Appstore వ్యూహాత్మక OEM భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంతో పాటు అనేక ఇతర ప్రధాన స్మార్ట్ ఫోన్ తయారీ దారులతో కూడా చర్చలు ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాది చివరిలోపు 250-300 మిలియన్ పరికరాలలో ముందస్తు ఇన్‌స్టలేషన్లు చేయించుకోవాలని లక్ష్యం నిర్ణయించుకోగా, ఈ భాగస్వామ్యాలు నిరంతరాయ ఇన్‌స్టాలేషన్, అప్‌డేట్లకు భరోసా ఇస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement