Saturday, May 4, 2024

ఒడిశా నుంచి ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్లు వ‌చ్చేశాయి….

హైదరాబాద్‌, : రాష్ట్రానికి ఆక్సిజన్‌ ట్యాంకర్లు సోమవారం సాయంత్రం చేరుకోగా, ప్రస్తుతానికి ఆక్సిజన్‌ కొరత తీరినట్లేనని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. మొ త్తం 9 ట్యాంకర్లు, 150 టన్నుల ఆక్సిజన్‌తో రాష్ట్రానికి చేరు కున్నాయి. హైదరాబాద్‌కు వచ్చిన ట్యాంకర్లను ముందుగా గచ్చిబౌలిలోని టిమ్స్‌కు పంపించారు. ఆ తర్వాత కరీంనగర్‌, చర్లపల్లి, కింగ్‌కోఠి, చెస్ట్‌ ఆసుపత్రి, ఖమ్మం జిల్లాలకు ఈ ఆక్సి జన్‌ ట్యాంకర్లు చేరుకున్నాయి. ఒడిషాలోని భువనేశ్వర్‌ నుం చి ఈ ట్యాంకర్లను ఆర్టీసీ డ్రైవర్లు తీసుకువచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు ట్యాంకర్లను తీసుకు వచ్చేందుకు భువనేశ్వర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. సోమ వారం రాత్రి కూడా మళ్లి ఆర్టీసీ డ్రైవర్లు భువనేశ్వర్‌కు వెళ్లి నట్లు ఆర్టీసీ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఆక్సిజన్‌ ట్యాంకర్లను తీసుకురావడంలో ఆర్టీసీ డ్రైవర్లను విని యాగిస్తున్నారు. కాగా 150 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌తో కూడిన 9 ట్యాంకర్లు హైదరాబాద్‌కు చేరుకోవడంతో అన్ని వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ప్రస్తుతం కరోనా పేషం ట్స్‌ ఆక్సిజన్‌ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ఒడిషా నుంచి ఆక్సి జన్‌ను తీసుకువచ్చారు. మరో నాలుగు రోజుల్లో మరిన్ని ట్యాంకర్లు కూడా రాష్ట్రానికి రానున్నాయి. యుద్ధ విమా నాల్లో భువనేశ్వర్‌కు వచ్చిన ఆక్సిజన్ ట్యాంక‌ర్ల‌ను నింపిన త‌ర్వాత రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు తీసుకు రావడంలో ఆర్టీసీ డ్రైవర్లు కృషి చేస్తున్నారు. దేశం లోని తొలి సారి తెలంగాణ ప్రభుత్వం యుద్దవిమా నాల్లో ఆక్సిజన్‌ ట్యాంకర్లను పంపగా, దీనివల్ల మూడురోజుల సమ యం ఆదా అయింది. అక్సిజన్‌ కొరతపై ప్రభుత్వానికి ఒత్తిడి తగ్గిం ది. మరోవైపు అసలు ఆక్సిజన్‌ను ఏ ఆస్పత్రిలో ఎంత విని యాగిస్తున్నారు.. ఎంత అవసరం ఉంది.. అన్న అంశంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ఆస్పత్రుల వారీగా వివరాలు సేకరిస్తోంది. డిమాండ్‌ ను తెలుసుకుంటూ, సక్రమ వినియోగానికి చర్యలు తీసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement