Thursday, April 25, 2024

కరోనా ఎఫెక్ట్ కారణంగా టీఆర్ఎస్ ప్లీనరీ వాయిదా

కరోనా వైరస్ తీవ్ర ప్రభావం కారణంగా 20వ టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వాయిదా వేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లీనరీ నిర్వహిస్తుంటారు. ఈ ఫ్లీనరీకి రాష్ట్రంలోని మండల, జిల్లా నేతలు, ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఫిబ్రవరి 7న నిర్వహించిన పార్టీ ముఖ్యుల సమావేశంలో కేసీఆర్ పిలుపునిచ్చారు. 6 లక్షల మందితో నిర్వహించాలని భావించారు. కానీ కరోనా విజృంభణతో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడం సబబు కాదని భావించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రద్దు చేశారు. దీంతో 2019, 2020, 2021లో వరుసగా మూడోసారి వాయిదా పడినట్లయింది. దీంతో పార్టీ పదవులు ఆశిస్తున్నవారికి కొంత నిరాశే మిగిలింది.

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ జెండాను తెలంగాణ భవన్‌లో ఎగురవేస్తారు. కరోనాతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేశవరావు జెండా ఎగురవేయనుండగా, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పార్టీ జెండాలను ఎగురవేయనున్నారు. కరోనా దృష్ట్యా పార్టీ ముఖ్యులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు నేతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement