Tuesday, April 23, 2024

పవన్-దిల్ రాజు-వేణు శ్రీ రామ్ కాంబో రిపీట్..?

దిల్ రాజు బ్యానర్ పై మరో సినిమా చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకరించాట. వకీల్ సాబ్’ ఘన విజయాన్ని సాధించిన తర్వాత దిల్ రాజు, పవన్ కళ్యాణ్ మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. దాంతో దిల్ రాజు బ్యానర్ పై మరో సినిమా చేయడానికి పవన్ కల్యాణ్ అంగీకరించారు. పవన్ కల్యాణ్ తో సినిమాను నిర్మించాలనే తన కోరిక నెరవేరడానికి 22 ఏళ్లు పట్టిందని ఇటీవల ఒక వేదికపై పేర్కొన్నారు దిల్ రాజు. అయితే పవన్తో తన రెండో సినిమా మాత్రం పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ తో తీయనున్నారని ఉన్నారని టాక్. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అడ్వాన్స్ కూడా పవన్ కు చేరిందనే టాక్ వచ్చింది. ఈ సినిమా కోసం మంచి కథను రెడీ చేయమని ఇద్దరు ముగ్గురు దర్శకులతో దిల్ రాజు చెప్పారట. అందులో ‘వకీల్ సాబ్’ దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా ఉన్నాడు. పవన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందనే  విషయం వేణు శ్రీరామ్ పట్టేశాడు. అందువలన అందుకు తగిన కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. పవన్ ను ఒప్పించేలా కథపై గట్టిగానే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement