Sunday, April 28, 2024

సరికొత్త ప్రేమ గీతం ‘దిల్‌ నే’విడుదల

ప్రేమలో పడటమే ఓ అద్వితీయ భావన. అనుభవిస్తే కానీ అంతుపట్టని వర్ణణాతీత భావమది. ఈ భావోద్వేగాన్ని సరికొత్త మార్గంలో వేడుక చేస్తూ డే ఒన్‌, కశ్యప్‌ సహకారంతో సరికొత్త ప్రేమ గీతం ‘దిల్‌ నే’ను విడుదల చేసింది. ఈ సింగిల్‌ ఉల్లాసంగా, సరదాగా ఉండటంతో పాటుగా మీరు తొలిసారిగా మీ హృదయేశ్వరిని కలుకున్నప్పుడు ఏ విధమైన అనుభూతులను పొందుతారో అదే తరహా అనుభవాలను అందించే రీతిలో ఉంటుంది.
బాలీవుడ్‌, పాప్‌, ఆర్‌ఎన్‌బీల సమ్మేళనంలా దిల్‌నే పాట ఉంటుంది. ఈ గీతానికి సాహిత్యం అందించడంతో పాటుగా స్వరకల్పన కూడా చేసిన కశ్యప్‌ ఈ మ్యూజిక్‌ వీడియోలో గానం కూడా చేశారు. ఈ మ్యూజిక్‌ వీడియోలో ఓ సంగీత కారుడు (కశ్యప్‌), ఓ మేకప్‌ ఆర్టిస్ట్‌ ను తొలిసారిగా చూసి మనసు పారేసుకుంటాడు. ఒకరి ప్రేమలో మరొకరు బందీలవుతారు. ఈ గీతం హిందీ, ఇంగ్లీష్‌ సాహిత్య సమ్మేళనంగా ఉండటంతో పాటుగా 2010లో నృత్యరీతులతో 2022 యూఫోరిక్‌ పాప్‌ శబ్దాలను తీసుకువస్తుంది. అతని తొలి సింగిల్‌ ఖోయా సా సైతం స్పాటిఫై ఇండియా వైరల్‌ చాట్స్‌లో నెంబర్‌ 1గా నిలిచింది. ఈ పాట గురించి కశ్యప్‌ మాట్లాడుతూ… దిల్‌ నే పాటకు పనిచేయడం అద్భుతమైన అనుభూతిని అందించిందన్నారు. దిల్‌ నే పాటను రెండు రోజుల్లో రాయడంతో పాటుగా కంపోజ్‌ చేశానన్నారు. ఈ పాట నా హృదయం నుంచి వచ్చిందని, ఇది ఎన్నో హృదయాలను తాకుతుందని ఆశిస్తున్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement