Wednesday, May 1, 2024

ఫ్రెంబ్ లో ట్వీట్ చేసిన ప్ర‌ధాని మోడీ – జీ సూయిస్ రావి అంటే ఏంటో తెలుసా

ప్ర‌ధాని మోడీని ..గుండెల‌కు హ‌త్తుకున్నారు ఫ్రాన్స్ అధ్య‌క్షుడు. దానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన స్నేహితుడిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చించినట్టు మోడీ చెప్పారు. రెండు దేశాల భాగస్వామ్యం అనేక రంగాలకు విస్తరించిందని, ఈ బంధం గర్వకారణమన్నారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని, ఇంతటి మంచి ఆతిథ్యం ఇచ్చిన ఫ్రాన్స్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేర‌కు ఫ్రెంచ్ లోనూ ఆయన ట్వీట్ చేశారు. ‘జీ సూయిస్ రావి (చాలా సంతోషంగా ఉంది)’ అంటూ తమ భేటీ గురించి వివరించారు. కాగా, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరింధమ్ బాగ్చీ కూడా ఇరు దేశాధ్యక్షుల సమావేశం గురించి ట్విట్టర్ లో వెల్లడించారు. భారత్–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై తదుపరి చర్యలకు మోదీ, మెక్రాన్ అంగీకరించారని చెప్పారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాధినేతలు ఉక్రెయిన్ సంక్షోభంపై చాలా సేపు చర్చించినట్టు తెలుస్తోంది. దాని వల్ల ఎదురైన సంక్షోభ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement