Thursday, March 28, 2024

ఆప్ఘ‌న్ మ‌హిళ‌ల‌కి డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు- తాలిబ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం

ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌ల‌పై ఎన్నో ఆంక్ష‌లు విధించారు తాలిబ‌న్లు. కాగా ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.
ఆఫ్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు అక్కడి మీడియా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు మీడియా తెలిపింది. ముఖ్యంగా తాలిబన్లు.. మహిళలపై ఉద్యోగాలు, పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement