Tuesday, April 30, 2024

కొత్తపేటలో అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన ముజిగల్‌

భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌, ముజిగల్‌ తమ నాల్గవ అత్యాధునిక సంగీత అకాడమీని హైదరాబాద్‌లోని కొత్తపేటలో ప్రారంభించింది. ముజిగల్‌ ఫౌండర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ ఏలూరి సమక్షంలో గాయకులు పార్ధసారధి, శ్రీకృష్ణ విష్ణుబొట్ల ఈ అకాడమీని ప్రారంభించారు. కొత్తపేటలో ముజిగల్‌ అకాడమీ ప్రారంభం గురించి ముజిగల్‌ ఫౌండర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ… సంగీత విద్యను అందరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యంతో ముజిగల్‌ అకాడమీ తీర్చిదిద్దామన్నారు. అభ్యాసకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రాన్ని తమకు దగ్గరలో అందిస్తుందన్నారు. సంగీతంలో అత్యుత్తమ అభ్యాసం, బోధన అనుభవాలను ఈ కేంద్రం అందించనుందన్నారు. భారతీయ శాస్త్రీయ, పాశ్చాత్య సంగీతంలో విస్తృత శ్రేణి కోర్సులను ఇది అందిస్తుందన్నారు. ఈ కోర్సులను నిష్ణాతులైన సంగీత అధ్యాపకులు బోధించనున్నారన్నారు. వీటితో పాటుగా అభ్యాసకులను లక్ష్యంగా చేసుకుని ఓ నిర్మాణాత్మక కరిక్యులమ్‌ (బోధనాంశాలు), పీరియాడిక్‌ ఎస్సెస్‌మెంట్స్‌, సర్టిఫికేషన్‌, సౌకర్యవంతమైన ఫీజు చెల్లింపు ప్లాన్స్‌, సుశిక్షితులైన అధ్యాపకులను అందుబాటులో ఉంచామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement