Sunday, April 28, 2024

మ్యూజిగల్‌ మ్యూజిక్‌ అకాడమీ సమ్మర్‌ క్యాంప్ ప్రారంభం

మ్యూజిగల్‌ మ్యూజిక్‌ అకాడమీ తమ సమ్మర్‌ క్యాంప్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించినట్లు వెల్లడించింది. సంగీతంలో వినూత్న అభ్యాస అనుభవాలను విద్యార్ధులు పొందే రీతిలో ఈ తరగతులకు రూపకల్పన చేశారు. ఆరు వారాల పాటు జరిగే ఈ సంగీత శిక్షణ కార్యక్రమం ఏప్రిల్‌ మధ్య నుంచి జూన్‌ మొదటి వారం వరకూ జరుగుతుంది. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఈ వేసవి శిబిరంలో పాల్గొనవచ్చు. ఈసమ్మర్‌ క్యాంప్‌ ప్రధానంగా నాలుగు అంశాలు .. పియానో, గిటార్‌, డ్రమ్స్‌, వోకల్స్‌పై జరుగుతాయి. ప్రతి సజెక్ట్‌నూ అనుభవజ్ఞులైన నిపుణులు బోధిస్తారు.

ఈసంద‌ర్భంగా మ్యూజిగల్‌ మ్యూజిక్‌ అకాడమీ ఫౌండర్‌ లక్ష్మీ నారాయణ యేలూరి మాట్లాడుతూ… ఈ వినూత్న అభ్యాస అనుభవాలను త‌మ విద్యార్ధులకు అందిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. వారి సంగీత నైపుణ్యాన్ని వినోద, అనుసంధానిత వాతావరణంలో మెరుగు పరుచుకునే అవకాశం దీని ద్వారా అందిస్తున్నామన్నారు. త‌మ వేసవి శిబిరం సంగీతంలో ఓనమాలు నేర్చుకునే వారితో పాటుగా కాస్త నైపుణ్యం ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement