Friday, May 3, 2024

ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ ఏరా కోసం ప్రత్యేక ప్రీ-బుక్ ఆఫర్‌ను ప్రకటించిన మేట‌ర్

సాంకేతిక ఆవిష్కరణల ఆధారిత స్టార్టప్ అయిన మేట‌ర్, దాని ఫ్లాగ్‌షిప్ మోటార్‌బైక్, మేట‌ర్ ఏరా ప్రీ-బుకింగ్‌ ప్రారంభించడం కోసం సన్నద్ధమైంది. ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్ మే 17 నుండి మేట‌ర్.ఇన్, ప్లిప్ కార్ట్.క‌మ్ లేదా ఓటోకాపిటల్.ఇన్ లో దేశంలోని 25 జిల్లాల్లో తెరవబడుతుంది. ప్రీ బుక్ సిటీలు, జిల్లాలుగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కృష్ణా, బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూర్, మధురై, ముంబై, నవీ-ముంబై, థానే, రాయగఢ్, పూణే, నాగ్‌పూర్, నాసిక్, అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, జైపూర్, ఇండోర్, ఢిల్లీ ఎన్ సీఆర్, పాట్నా, లక్నో, కాన్పూర్, గౌహతి, కమ్రూప్, కోల్‌కతా, భువనేశ్వర్, కటక్, కోర్ధా ఉన్నాయి.

మేట‌ర్ ఏరా మొదటి 9,999 ప్రీ-బుకింగ్‌లకు రూ.5,000ల‌ ప్రత్యేక ధర ప్రయోజనం అందిస్తారు. వినియోగదారులు రూ.1999 ల‌తో ప్రీబుక్ చేయవచ్చని ఆ సంస్థ తెలిపింది. అలాగే 10,000 ప్రీ-బుకింగ్‌ల నుండి 29,999 ప్రీ-బుకింగ్‌ల వరకు, మేట‌ర్ ఏరా రూ.2,500ల‌ ప్రత్యేక ప్రయోజనంతో అందించబడుతుందని, వినియోగదారులు రూ.2999ల‌తో ప్రీ-బుక్ చేయవచ్చని పేర్కొంది. ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఏరా లను బుక్ చేయాలనుకుంటే, అదే ఫోన్ నంబర్ నుండి 2 వరకు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రీ-బుకింగ్‌ల తర్వాత డెలివరీకి ముందు మీకు సమీపంలోని మ్యాటర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లలో టెస్ట్ డ్రైవ్‌లు అందించబడతాయని ఆ సంస్థ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement