Sunday, April 28, 2024

ఐడీబీఐ ఎంఎఫ్‌ స్కీమ్‌ల విలీనం పూర్తి చేసినట్లు ప్రకటించిన ఎల్ఐసీ

హైద‌రాబాద్ : భారతీయ అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన ఫండ్ హౌస్‌లలో ఒకటైన ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్, ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల టేకోవర్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ విలీనం జూలై 29, 2023. నుండి అమలులో కి వచ్చింది. ఈ సంద‌ర్భంగా ఎల్‌ఐసి మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఒ టి ఎస్ రామకృష్ణన్ మాట్లాడుతూ… భారతదేశంలోని కీలక మార్కెట్‌లలో పెట్టుబడి అవసరాలను తీర్చడానికి విభిన్నమైన మ్యూచువల్ ఫండ్ హౌస్‌గా సేవలందించేలా త‌మ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తున్నందున, ఇది త‌మ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు.

మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్, గోల్డ్ ఫండ్, పాసివ్ ఫండ్ సెగ్మెంట్‌లు మొదలైన వాటిలో త‌మ స్కీమ్ ఆఫర్‌లను విస్తృతం చేయాలనే త‌మ లక్ష్యాన్ని ఈ విలీనం తీర్చనుందన్నారు. ఈ విలీనం, విస్తృత శ్రేణిలో మార్కెట్ లో చేరుకునేందుకు తోడ్పడటంతో పాటుగా మరింత విస్తృతమైన ప్రోడక్ట్ బాస్కెట్‌ను అందించడంలో సహాయ పడుతుందన్నారు. అభివృద్ధి చెందుతున్న అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను ఒడిసి పట్టడంలో, పెట్టుబడిదారులు, పంపిణీ భాగస్వాముల కోసం విలువను పెంచడంలో త‌మ సంయుక్త బలం త‌మకు సహాయపడుతుందన్నారు. సంపద సృష్టిలో విశ్వసనీయ భాగస్వామిగా, మ్యూచువల్ ఫండ్‌ పరంగా ప్రతి ఒక్కరి ఎంపికగా నిలవాలన్నది త‌మ లక్ష్యమ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement