Thursday, December 7, 2023

అట్టపెట్టెలో పసికందు మృతదేహాం..

హైరదాబాద్ : అట్టపెట్టెలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహాన్ని పెట్టి రోడ్డుపై వదిలి వెళ్లారు. బాలాపూర్‌ డీఆర్‌డీఎల్‌ శివాజీ చౌక్‌ వద్ద అట్టపెట్టెలో అప్పుడే పుట్టిన ఓ శిశువు పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం వస్త్రంలో చుట్టి ఉంది. శిశువు ఇక్కడ వేసిన తర్వాత మృతి చెందాడా, మృతిచెందిన తర్వాత పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు

Advertisement

తాజా వార్తలు

Advertisement