Wednesday, May 1, 2024

తెగించి పోరాడితేనే గుర్తింపు… బాబు

తాజా పరిస్థితులపై పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెగించి పోరాడాలని తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చేలోపు ఇదే పెద్ద ఉప ఎన్నిక అన్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదన్నారు. రిజర్వేషన్లు, విధేయతలు, మోహమాటాలు ఇకపై చెల్లవన్నారు. వైకాపా వైఫల్యాలపై 10అంశాలు గుర్తించి ప్రతి ఇంటికి వాటిని నాయకులు వివరించాలని ఆదేశించారు.

నాయకులు క్షేత్రస్థాయి పనితీరుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అద్దంపడుతున్నాయన్నారు. ప్రతి క్లస్టర్ కు ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అయిదుగురు తో తిరుపతి ఉపఎన్నిక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కమిటీలో లోకేశ్, అచ్చెన్నాయుడు, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ ఉంటారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement