Sunday, April 21, 2024

బ్రెయిలీ లిపిలో తెలంగాణ ఉద్యమ చరిత్ర..

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ చరిత్రను త్వరలో బ్రెయిలీ లిపిలో ముద్రించేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దివ్యాంగుల సహాకార సంస్థ చైర్మన్‌కె.వాసుదేవరెడ్డి తెలిపారు. మలక్‌పేట నల్గొండ చౌరస్తాలోని తెలంగాణ రాష్ట్ర బ్రెయిలీ ప్రెస్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బ్రెయిలీ లిపిని ఆధునీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు ఈ లిపిలో ఓటర్‌ స్లిప్‌లను ముద్రించి అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రెయిలీ ప్రెస్‌ ఎడిటర్‌ జి.వెంకటేశ్వర్‌రావు, మేనేజర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement