Saturday, April 27, 2024

లారాదత్తా డిజైన్‌ చేసిన కలెక్షన్‌ అరియాస్‌ను పరిచయం చేసిన @ హోమ్‌

నిల్‌కమల్‌ లిమిటెడ్‌కు చెందిన వాణిజ్య విభాగం @ హోమ్ అండ్ సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి లారాదత్తా కలిసి ప్రత్యేక శ్రేణి హోమ్‌ డెకార్‌ కలెక్షన్‌–అరియాస్‌ను విడుదల చేశారు. లారా దత్తా డిజైన్‌ చేసిన అరియాస్‌లో డైనింగ్‌, బెడ్డింగ్‌, బాత్‌ విభాగానికి చెందిన పలు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉంటాయి. ఈసంద‌ర్భంగా @ హోమ్ మర్చండైజింగ్‌ ఫర్ సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌– బయింగ్‌ అండ్ ముర్తాజా మంగ్లోర్వాలా మాట్లాడుతూ… సృజనాత్మక హోమ్‌ మేకోవర్‌ ఆలోచనలు కలిగిన వినియోగదారులకు అత్యుత్తమ కేంద్రంగా @ హోమ్‌ ఉంటుందన్నారు.

లారా దత్తా డిజైన్‌ చేసిన అరియాస్‌ కలెక్షన్‌ @ హోమ్‌ బ్రాండ్‌ సిద్ధాంతాన్ని అత్యుత్తమంగా చూపడంతో పాటుగా బహుళ విభాగాల్లో వినియోగదారులకు విస్తృతశ్రేణి అవకాశాలను అందిస్తుందని అన్నారు. ఈ భాగస్వామ్యం గురించి లారాదత్తా మాట్లాడుతూ… ఆధునిక భారతీయ జీవనానికి ప్రతీకగా, ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ సమ్మేళనంగా అరియాస్‌ కలెక్షన్‌ ఉంటుందన్నారు. కాలాతీత ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ను ఖచ్చితత్త్వంతో అందించాలనే త‌న అభిరుచికి అరియాస్‌ నిదర్శనమ‌న్నారు. @ హోమ్‌ తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నానని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement