Thursday, May 9, 2024

TS: అక్టోబర్ 15 నుండి హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 440 డెలివరీలు ప్రారంభం

హైద‌రాబాద్ : రాబోయే పండుగ సీజన్‌లో కస్టమర్‌లకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్, తన మొదటి సహ-అభివృద్ధి చెందిన ప్రీమియం మోటార్ సైకిల్ హార్లీ డేవిడ్ సన్ ఎక్స్440 డెలివరీని నవరాత్రి పండుగ శుభారంభమైన మొదటి రోజున అంటే, అక్టోబర్ 15న ప్రారంభించ‌నుంది.

ఈసంద‌ర్భంగా హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) నిరంజన్ గుప్తా మాట్లాడుతూ… హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 440 దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని సృష్టిస్తూనే ఉందన్నారు. త‌మ నీమ్రానా సదుపాయంలో ఉత్పత్తి పూర్తి జోరుగా సాగుతోందన్నారు. త‌మ ప్రీ-బుక్ చేసిన కస్టమర్లలో భారీ సంఖ్యలో మోటార్‌సైకిల్‌ను టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని పొందారన్నారు. నవరాత్రి మొదటి రోజు నుండి త‌మ కస్టమర్‌లకు హార్లీ డేవిడ్ సన్ ఎక్స్440 డెలివరీలను ప్రారంభించడం ద్వారా పండుగ ఉత్సాహాన్ని నింపడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామ‌న్నారు. ఇది త‌మ ప్రీమియం ప్రయాణంలో ప్రారంభం మాత్రమేన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement