Wednesday, May 22, 2024

స్వతంత్ర భారత వ్రజోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొనాలి : ఎంపీ కేశవరావు

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎంపీ కే కేశవరావు పేర్కొన్నారు. ఉత్స‌వాల‌కు సంబంధించిన లోగోను ఉత్సవాల కమిటీ చైర్మన్‌, ఎంపీ కే కేశవరావు రవీంద్రభారతిలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ద్విసప్తాహ వేడుకల లోగోను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ధర్మాన్ని సూచిస్తున్న ధర్మచక్రం జాతీయ పతాకంలో ఉందన్నారు. స్వతంత్ర భారత వ్రజోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొనాలన్నారు.

అన్ని థియేటర్లలో మహాత్మగాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. 15 రోజుల పాటు రాష్ట్రమంతటా చారిత్రక ప్రదేశాలల్లో విద్యుద్దీప అలంకరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రవీంద్రభారతీలో 15 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కోటి ఇరవై లక్షల జాతీయ జెండాల పంపిణీ జరుగనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8న ఉత్సవాలు ప్రారంభమై.. 22న ఎల్‌బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement