Monday, April 29, 2024

అత్యాధునిక టెక్నాల‌జీతో కమాండ్ కంట్రోల్ సెంటర్ : మంత్రి తలసాని

రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్‌ దేశానికే మణిహారం లాంటిదని మంత్రి తలసాని అన్నారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని హోమ్ మినిష్టర్ మహ్మద్‌ అలీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవన నిర్మాణ పనులు పూర్తి అవుతున్నాయి. సుమారు 600కోట్ల రూపాయల తో ఈ భవనాన్ని రూపొందించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీ ని ఉపయోగించామన్నారు. అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశాం. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత మెరుగవుతాయన్నారు. కాగా, ఆగస్టు 4న సీఎం కేసీఆర్‌ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement