Tuesday, April 30, 2024

మట్టి విగ్రహాలతో వినాయ‌క‌ నవరాత్రులు – అర్వింద్ కుమార్

వినాయక నవరాత్రులను పర్యావరణహితంగా మట్టి విగ్రహాలతో జరుపుకోవాలని HMDA మెట్రోపాలిటన్ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. ఈ నెల 31న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఎంఏ అండ్ యూడీ కార్యాలయంలో పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ బి.రాజమౌళి, అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లె, సంయుక్త సంచాలకులు డి ఎస్. జగన్, డి శ్రీనివాస్, ఉప సంచాలకులు యాసా.వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు ఎం. యామిని, హెచ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి, పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కార్యాలయం ఓ.ఎస్.డి. లు శ్రీనివాస్ రావు, రాధ, HMDA, పురపాలక విభాగాల అధికారులకు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

ఆయ‌న మాట్లాడుతూ… ఉచితంగా 1 లక్ష మట్టి వినాయక విగ్రహాలు హెచ్ఎండీఏ పంపిణీ చేస్తుంద‌న్నారు. పర్యావరణ సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.అలాగే నగరవ్యాప్తంగా 39 లొకేషన్స్ తో పాటు 1 మొబైల్ వెహికల్స్ & 5 రెసిడెన్సీయల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా ఈ నెల 25 నుంచి 30 వరకు HMDA ద్వారా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తార‌న్నారు. విగ్రహాలు పంపిణీకి, పర్యవేక్షణకు ప్రాంతాలు వారిగా ఇంచార్జి అధికారులను నియమించిన‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement