Tuesday, April 16, 2024

Spl Story: రాజకీయ పార్టీలకు లెక్కలేనంత డబ్బు.. 15వేల కోట్లను అన్​నోన్​ సోర్సెస్​ అంటూ తప్పుడు లెక్కలు!

రాజకీయ పార్టీలకు పలు సంస్థలు, వ్యక్తుల నుంచి విరాళాలు వస్తుంటాయి. అయితే.. వీటికి ఆధారాలు కూడా ఉంటాయి. కానీ, ఆధారాలు లేని అన్​నోన్​ సోర్సెస్​ అంటూ దేశంలోని పలు రాజకీయా పార్టీలు తప్పుడు లెక్కలు చూపుతున్నాయి. 15వేల కోట్లకు సంబంధించిన విషయంలో పార్టీలు లెక్కలు చూపడం లేదు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానికి మాత్రం ఆధారాలు చూపడం లేదు. ఇట్లాంటి లెక్కల్లోని డబ్బు ఎక్కువగా కాంగ్రెస్​, బీజేపీ పార్టీలకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై అసోసియేషన్​ ఫర్​ డెమోక్రటిక్​ రిఫార్మ్స్​ (ADR) చేసిన విశ్లేషణ ఇప్పుడు బయటికి వచ్చింది. దీంతో పార్టీల బండారం మొత్తం బయటపడింది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

జాతీయ పార్టీలు 2004-05 మరియు 2020-21 మధ్య కాలంలో అన్​నోన్​ సోర్సెస్​ నుంచి రూ. 15,077.97 కోట్లకు పైగా వసూలు చేశాయని ఎన్నికల హక్కుల సంఘం – అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిన విశ్లేషణలో తేలింది. 2020-21లో జాతీయ, ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం తెలియని మూలాల నుండి రూ. 690.67 కోట్లుగా ఉంది. ఈ విశ్లేషణ కోసం అసోసియేషన్​ ఫర్​ డెమోక్రటిక్​ రిఫార్మ్స్​ (ADR) ఎనిమిది జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకుంది.

జాతీయ పార్టీలలో భారతీయ జనతా పార్టీ (BJP), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC), కమ్యూనిటీ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPM), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP),  కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), నేషనల్ పీపుల్స్ పార్టీ (NPEP) వంటివి ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలలో AAP, AGP, AIADMK, AIFB, AIMIM, AIUDF, BJD, CPI(ML)(L), DMDK, DMK, GFP, JDS, JDU, JMM, KC-M, MNS, NDPP, NPF, PMK, RLD, SAD, SDF, శివసేన, SKM, TDP, TRS, YSR-కాంగ్రెస్ పార్టీలున్నాయి.

పార్టీల ఆదాయపు పన్ను రిటర్న్ లు (ITR), భారత ఎన్నికల సంఘం (ECI)కి దాఖలు చేసిన విరాళాల ప్రకటనల ఆధారంగా జరిపిన విశ్లేషణలో FY 2004-05, 2020-21 మధ్య జాతీయ పార్టీలు అన్​నోన్​ సోర్సెస్​ నుంచి రూ.15,077.97 కోట్లు వసూలు చేశాయని తేలింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఎనిమిది జాతీయ రాజకీయ పార్టీలు తెలియని మూలాల నుంచి రూ. 426.74 కోట్ల ఆదాయాన్ని ప్రకటించగా, 27 ప్రాంతీయ పార్టీలు తెలియని మూలాల నుంచి రూ. 263.928 కోట్ల ఆదాయాన్ని పొందాయని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ రూ. 178.782 కోట్లను తెలియని మూలాల ద్వారా వచ్చిన ఆదాయంగా ప్రకటించింది. ఇది జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 41.89 శాతం (రూ. 426.742 కోట్లు)” అని విశ్లేషణ తెలిపింది.

- Advertisement -

జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 23.55 శాతం అంటే తెలియని మూలాల నుంచి వచ్చిన ఆదాయం 100.502 కోట్లుగా బీజేపీ ప్రకటించింది. తెలియని ఆదాయంలో మొదటి ఐదు ప్రాంతీయ పార్టీలు వైఎస్ఆర్-కాంగ్రెస్ రూ.96.2507 కోట్లు, డీఎంకే రూ.80.02 కోట్లు, బీజేడీ రూ.67 కోట్లు, ఎంఎన్ఎస్ రూ.5.773 కోట్లు, ఆప్ రూ.5.4 కోట్లుగా ఉన్నాయి.  మొత్తం రూ. 690.67 కోట్లలో 47.06 శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయం. ఫైనాన్షియల్​ ఇయర్​ 2004-05, 2020-21 మధ్య కాలంలో కూపన్ల విక్రయం ద్వారా కాంగ్రెస్, NCP యొక్క ఉమ్మడి ఆదాయం రూ.4,261.83 కోట్లుగా ఉందని ADR తెలిపింది.

ఇక.. ఫైనాన్షియల్​ ఇయర్​ 2020-21కి సంబంధించి ఏడు రాజకీయ పార్టీల ఆడిట్ మరియు కంట్రిబ్యూషన్ రిపోర్ట్‌లలో రిపోర్టింగ్ వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ ఏడు పార్టీలలో AITC, CPI, AAP, SAD, KC-M, AIFB మరియు AIUDF ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement