Thursday, May 16, 2024

HYD: చంద్రయాన్-3 మన అందరి విజయం

భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్క పౌరుడు గర్వించదగ్గ విజయం చంద్రయాన్ -3. సర్ మౌంట్ పాఠశాలలో చంద్రయాన్-3 సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా చైర్మన్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ… జాబిల్లిపైన భారత ముద్ర పడడానికి, దేశ ఖ్యాతి ప్రపంచ నలుమూలలా తెలిసేలా చేసిన ఇస్రో శాస్త్రవేత్తల కృషిని, పట్టుదల అనిర్వచనీయమైందన్నారు.

ఇది యావత్ భారత విజయమని, దీని ద్వారా విద్యార్థులు స్ఫూర్తి పొందాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడు చైతన్య మురళి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని జాతీయ గీతాలాపన చేసి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement