Sunday, May 5, 2024

ఎర్రగడ్డలో చైన్ స్నాచింగ్.. దొరకబట్టుకుని కుమ్మేసిన స్థానికులు

(ప్రభ న్యూస్): హైదరాబాద్ సిటీలోని ఎర్ర‌గ‌డ్డ‌లో ప‌ట్ట‌ప‌గ‌లే చైన్ స్నాచింగ్ జ‌రిగింది. రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్నఓ మ‌హిళ మెడ‌లో నుంచి యువ‌కుడు బంగారు గొలుసును లాక్కొని పారిపోయేందుకు ట్రై చేశాడు. ఆ గొలుసు లాక్కొని బైక్‌పై ప‌రార‌వుతుండ‌గా అదుపుతప్పి ఆ యువ‌కుడు కింద‌ప‌డిపోయాడు.

బాధిత మ‌హిళ అరుపుల‌తో అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు.. బైక్ నుంచి కింద‌ప‌డ్డ చైన్ స్నాచ‌ర్‌ను ప‌ట్టుకుని ఇరగ కుమ్మేశారు. నిందితుడిని మొయినాబాద్‌కు చెందిన నాగ‌రాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు చైన్ స్నాచర్ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement