Monday, April 29, 2024

తార్నాక మెట్రో వ‌ద్ద కారు ద‌గ్ధం – ప్ర‌యాణీకులు సుర‌క్షితం..

హైదరాబాద్ : తార్నాక మెట్రో స్టేషన్‌ వద్ద ఆక‌స్మికంగా కారులో మంట‌లు చెల‌రేగి ద‌గ్థ‌మైంది…ఎల్‌బీ నగర్‌ వైపు నుంచి సికింద్రాబాద్‌ వైపు ప్రయాణికులతో వెళ్తున్న కారులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ కారును నిలిపి ప్రయాణికులను కిందకు దించాడు. చూస్తుండగానే మంటలు అంటుకొని పూర్తిగా వ్యాపించి కారు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. దీంతో కొంత సేపు ట్రాఫిక్ కు అంత‌రాయం ఏర్ప‌డింది.. టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల‌తోనే కారులో మంట‌లు వ్యాపించాయ‌ని పోలీసులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement