Thursday, April 25, 2024

ఉమ్రాన్ మాలిక్‌తో క్యాంపస్ యాక్టివ్‌వేర్ భాగస్వామ్యం

భారతదేశంలోని అతిపెద్ద స్పోర్ట్స్, అథ్లెయిజర్ ఫుట్‌వేర్ బ్రాండ్‌లలో ఒకటైన క్యాంపస్ యాక్టివ్‌వేర్, తమ నైట్రోఫ్లై శ్రేణిని విడుదల చేయటం కోసం భారతదేశపు అత్యంత వేగవంతమైన బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రకటించింది. ప్రఖ్యాత క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్ చేత ప్రచారం చేయబడుతున్న ఈ షూస్ అత్యాధునిక సాంకేతికత, విప్లవాత్మక నైట్రో టెక్నాలజీ కలిగి వున్నాయి. ఈ అంశాలు వీటిని పోటీ సంస్థల నుండి ప్రత్యేకంగా నిలుపుతాయి.

ఈ సందర్భంగా క్యాంపస్ యాక్టివ్‌వేర్ సిఈఓ నిఖిల్ అగర్వాల్ మాట్లాడుతూ… త‌మ నైట్రోఫ్లై శ్రేణిని విడుదల చేయటం కోసం ఉమ్రాన్ మాలిక్‌తో భాగస్వామ్యం కావడం త‌మకు ఆనందంగా ఉందన్నారు. భారతదేశపు అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ఉమ్రాన్ అసాధారణ నైపుణ్యాలు, హద్దులు ఆదిగమించాలన్నారు. అసాధారణ పనితీరును సాధించాలనే త‌మ బ్రాండ్ సారాంశంతో సంపూర్ణంగా సరిపోతాయన్నారు. ఉమ్రాన్ ప్రచారంతో నైట్రోఫ్లై అథ్లెటిక్ పాదరక్షల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేస్తుందని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఉమ్రాన్ మాలిక్ మాట్లాడుతూ… ఈ బూట్లు సాధారణ పాదరక్షలు మాత్రమే కాదు, వేగం, సౌకర్యం, నియంత్రణను అందించే గేర్లు అని వెల్లడించారు. అధునాతన నైట్రో టెక్నాలజీ ఆధారితమైన క్యాంపస్ యాక్టివ్‌వేర్ నైట్రోఫ్లై శ్రేణి, మొత్తం పనితీరును కొత్త ఎత్తులకు తీసుకువెళుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement