Thursday, May 2, 2024

బ్రో మోషన్‌ పోస్టర్ కి.. 5 మిలియన్‌ల వ్యూస్

బ్రో మోష‌న్ పోస్ట‌ర్ 5మిలియ‌న్ ల వ్యూస్ ని ద‌క్కించుకుని టాలీవుడ్‌లో సరికోత్త రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు ఈ రికార్డు రాధేశ్యామ్‌ పేరిట ఉంది. కేవలం మోషన్‌ పోస్టర్‌తోనే ఈ రేంజ్‌లో రికార్డులు నమోదవుతున్నాయంటే ఇంక సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందో అని అభిమానులు ఇప్పటి నుంచే ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుంటున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా,, మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్ మరో ప్రధాన హీరోగా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో కోట్ల ప్రశంసలు దక్కించుకున్న ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్‌ కథలో పలు మార్పులు చేర్పులు చేశాడు.పవన్ క‌ల్యాణ్ చాలా కాలం తర్వాత అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌ ఊగిపోతున్నారు. స్టైల్‌, యాటిట్యూడ్‌, స్వాగ్‌ ఇలా మూడింటి కలబోతతో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ కావడంతో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతుంది. ఇవన్నీ ఒకత్తయితే.. థమన్‌ నేపథ్య సంగీతం వేరే లెవల్‌. గూస్‌బంప్స్‌ అన్న పదం కూడా చాలదేమో అన్న రీతిలో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇరగదీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement