Thursday, May 2, 2024

HYD : క‌ర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, నవంబర్ 9 (ప్రభ న్యూస్) ఎల్.బి.నగర్ బారస పార్టీ అభ్యర్థి,శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గురువారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా సతీమణి కమల సుధీర్ రెడ్డి చే కలిసి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.దానిలో బాగంగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా దేవాలయం,కొత్తపేట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం,కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో వేద పండితులు అర్చకులచే ఆశీర్వచనం అందుకని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పలు దేవాలయల చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, ధర్మకర్తలు బిల్ల కంటి కిరణ్ కుమార్ గుప్తా, శ్రీనివాస్ యాదవ్ ,బబ్బురి ఆనంద్ గౌడ్, చీర తిరుమలేష్, మధు సాగర్, మేక సురేందర్ రెడ్డి, యాదగిరి ,మధుసూదన్ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి ,గోగిరెడ్డి అంజిరెడ్డి సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement