Tuesday, April 30, 2024

హైదరాబాద్‌లో విషాదం.. షట్టర్‌లో చిక్కుకుని బాలుడు మృతి

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఆటోమేటిక్‌ రోలింగ్‌ షట్టర్‌లో చిక్కుకొని బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలిలోని టీవీఎస్‌ షోరూం భవనం వద్ద బాలుడు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో షట్టర్‌ ఆటోమేటిక్‌ రోలింగ్‌ బటన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా షట్టర్‌ చుట్టేయడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి అర్జున్‌ కాంప్లెక్స్‌లోనే వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో బాంబు కలకలం

Advertisement

తాజా వార్తలు

Advertisement