Sunday, April 28, 2024

IIFA: అందుబాటులోకి వచ్చిన ఐఫా ఉత్సవం 2024 టిక్కెట్‌లు… ఇప్పుడే పొందండి..

హైదరాబాద్ : హిజ్ ఎక్సెలెన్సీ షేక్ నహయాన్ మబారక్ అల్ నహ్యాన్ (మినిస్టర్ ఫర్ టాలరెన్స్ అండ్ కోఎక్సిస్టేన్స్ ), మార్గనిర్దేశకత్వం లో ఐఫా ఉత్సవం 2024 అసాధారణమైన రెండు రోజుల వేడుకగా నిలువనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫా ఉత్సవం 2024, అబుదాబి సాంస్కృతిక అండ్ పర్యాటక శాఖ, మిరల్ భాగస్వామ్యంతో నిర్వహించబడుతోంది. ఐఫా ఉత్సవం 2024 అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో 2024 సెప్టెంబర్ 6వ, 7వ తేదీల్లో జరుగనుంది.

తెలుగు, కన్నడ చిత్రాల కేటగిరీ కోసం ఐఫా ఉత్సవం 2024 హోస్ట్‌లు ఎంపికయ్యారు. రానా దగ్గుబాటి తెలుగు కేటగిరీకి హోస్ట్ కాగా, విజయ్ రాఘవేంద్ర అండ్ అకుల్ బాలాజీ కన్నడ ఫిల్మ్ కేటగిరీకి హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు. ఐఫా ఉత్సవం 2024లో రాక్‌స్టార్ డీఎస్పీ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.


ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ…. ఐఫా ఉత్సవం దక్షిణ భారత సినిమాకి నిజమైన వేడుక అన్నారు. తాను అందులో భాగమైనందుకు థ్రిల్‌గా ఉన్నానన్నారు. అకుల్ బాలాజీ, విజయ్ రాఘవేంద్ర మాట్లాడుతూ… ఐఫా ఉత్సవం 2024లో కన్నడ ఫిల్మ్ కేటగిరీని హోస్ట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ , రాక్‌స్టార్ డీఎస్పీ నటి శ్రీలీల మాట్లాడుతూ… ఇది చాలా ప్రతిష్టాత్మకమైన వేదిక అన్నారు. ఈ సెప్టెంబర్‌లో యాస్ ఐలాండ్, అబుదాబిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఎదురుచూస్తున్నామన్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో ఐఫా ఉత్సవం గ్లోబల్ టూర్ కోసం టిక్కెట్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement