Tuesday, April 13, 2021

అసైన్డ్ భూములు క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌…

హైదరాబాద్‌, అసైన్డ్‌ భూము లను కొనుగోలు చేసి సాగుచేసుకుంటున్న వారికి, ప్రభుత్వం వరాలు ప్రకటించ నుందని తెలుస్తోంది. ప్రయోజనం కల్గించేలా క్రమబద్దీకరణ దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో సీఎం కేసీఆర్‌ కూడా శాసనసభా వేదికగా అసైన్డ్‌ భూము లపై కీలక ప్రకటన చేశారు. భూములకంటే పట్టాలెక్కువిచ్చారని, రాజకీయ పట్టాల వ్యవహారంగా ఈ ప్రహసనం కొనసా గిందని అభిప్రాయపడ్డారు. పొజిషన్లు, హద్దులు, భూములు లేకుండా కాగితా లిచ్చి చాటలో తవుడు పోసి కుక్కులకు కొట్లాట పెట్టినట్లుగా గత ప్రభుత్వాలు వ్యవహరించాయని, ఈ సమస్యలకు చరమగీతం పాడాల్సి ఉందన్నారు. రానున్న సవరణ ల్లో భాగంగా అసైన్డ్‌ భూముల పున: కేటాయింపు నియోజకవర్గ ఎమ్మెల్యే అధ్యక్షతన ఉన్న కమిటీకి బదులుగా కలెక్టర్లకు అధికారం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. తద్వారా చేతులు మారిన 2.41 లక్షల ఎకరాలను తిరిగి అసైన్డ్‌, లేదంటే మార్కెట్‌ ధరకు క్రమబద్దీకరించే పద్దతులను పరిశీలిస్తోంది. తద్వారా ఖజానాకు భారీగా రాబడి సమకూరనుందని, గ్రామాల్లో సమస్యలు తీరనున్నాయనే భావనకు వచ్చినట్లుగా తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 20.01 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూమి అసలైన లబ్ధిదారుల చేతుల్లో ఉంది. ఇందులో 84 వేల మంది విక్రయాలు, ఆక్రమణల వంటి అక్రమాలకు పాల్పడినట్లుగా రెవెన్యూ శాఖ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది.
తెలంగాణ అసైన్డ్‌ భూముల (బదలీ నిషేదిత పీవోటీ) చట్టం-1977ను సవరించేందుకు 2008నాటికి ముందు మాత్రమే అవకాశం ఉండగా, తెలంగాణ అసైన్డ్‌ ల్యాండ్‌(ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌) పీవోటీ చట్టం- 1977లోని సెక్షన్‌ 4ప్రకారం క్రమబద్దీకరించేం దుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఇందులో భాగంగానే తెలంగాణ అసైన్డ్‌ ల్యాండ్స్‌ (పీవోటీ) సవరణ చట్టం తెచ్చే యోచన చేస్తోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 22,63,139 ఎకరాల అసైన్డ్‌ భూమి 15.83 లక్షల మంది వద్ద ఉంది. 1,85,101 ఎకరాలతో అసిఫాబాద్‌ మొదటి స్థానంలో ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో 1,66,557 ఎకరాలు, నల్గొండలో 1,38,686 ఎకరాలు, కామారెడ్డిలో 1,33,157 ఎకరాల అసైన్డ్‌ భూములు ఉన్నాయని గుర్తించారు. ఇందులో బీసీ సామాజిక వర్గంలో 6,33,451 మందికి 8,14,008 ఎకరాలు పంపిణీ అయినట్లుగా తేల్చారు. ఎస్సీలకు 5,75,497 ఎకరాలు, ఎస్టీలు 6,72,959 ఎకరాలు, ఓసీలు 1,46,102 ఎకరాలు, మైనారిటీలకు 54,565 ఎకరాలను పంపిణీ చేసినట్లుగా రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 1977లో అసైన్డ్‌ భూముల బదలాయింపు నిషేద చట్టం(పీవోటీ 77)ను అమలులోకి తెచ్చింది.
అన్యాక్రాంతం…
రాష్ట్రవ్యాప్తంగా 22,63,139 ఎకరాల భూమిని పేదలకు ఆయా ప్రభుత్వాలు అసైన్‌ చేశాయి. 15.83 లక్షల మంది నిరుపేదలకు వీటిని పంపిణీ చేసినా అవి వారి చేతిలో లేవని తాజాగా ప్రభుత్వం గుర్తించింది. రెవెన్యూ శాఖ సేకరించిన సమాచారం మేరకు 98 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు ఇతరుల చేతుల్లోకి చేరినట్లు గా గుర్తించారు. పట్టా ఒకరి పేరుతో ఉండగా పొజిష న్‌లో మరొకరు ఉండటం, కొందరి భూములు నాలు గైదు చేతులు మారడం, కొందరి భూములు వివాదా ల్లో ఉండటం, కోర్టు పరిధిల్లో పేరుకుపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. వీటిని పీవోటీ చట్టం ప్రకారం ఏకపక్షంగా రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంది. అయితే చట్టాలను మార్చి ఎవరికీ ఇబ్బంది లేని రీతిలో సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. పొజిషన్‌లో ఎన్నేళ్లుగా ఉంటున్నారు… ఆయా భూముల్లో పాగా వేసిన వారి ఆర్థిక సామాజిక స్థితిగతుల ఆధారంగా క్రమబద్దీకరించనున్నారు. ఇందుకు కలెక్టర్లకు అధికారాలను అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News